17 Apr 2026, Fri

رَبَّنَا اصْرِفْ عَنَّا عَذَابَ جَهَنَّمَ إِنَّ عَذَابَهَا كَانَ غَرَامًا إِنَّهَا سَاءتْ مُسْتَقَرًّا وَمُقَامًا
రబ్బనా ఇస్ రిఫ్ అన్నా అజాబ జహన్నమా ఇన్నా అజాబహా కానా గరామా ఇన్నహ సఆత్ ముస్ తఖర్వో వ ముఖామా [25: 65-66]

Telugu Translation

మా ప్రభు మా పై నుంచి నరక శిక్షను తొలగించు . ఎందుకంటే ఆ శిక్ష ఎన్నటికి వీడనిది ని శ్చయంగా అది చాలా చెడ్డచోటు చెడ్డ నివాస స్ధలం .

رَبَّنَا هَبْ لَنَا مِنْ أَزْوَاجِنَا وَذُرِّيَّاتِنَا قُرَّةَ أَعْيُنٍ وَاجْعَلْنَا لِلْمُتَّقِينَ إِمَامًا
రబ్బనా హబ్ లనా మిన్ అజ్ వాజినా వజుర్రియాతినా ఖుర్రతా ఆయుని వజ్ ఆల్ నా లిల్ ముఖ్తఖినా ఇమామా [25:74]

Telugu Translation

ఓ మా ప్రభూ నువ్వు మా భార్యల ద్వారా , మా సంతానం ద్వారా మా కళ్ళకు చలువను ప్రసాదించు. మమ్మల్ని దైవ భక్తి పరుల నాయకుని గా చేయి.


رَبَّنَا لَغَفُورٌ شَكُورٌ
రబ్బనా లా గఫూరున్ షకూర్ [35: 34]

Telugu Translation

మా ప్రభువు అమితంగా క్షమించేవాడు ,సత్కార స్వభావుడు


آمَنُوا رَبَّنَا وَسِعْتَ كُلَّ شَيْءٍ رَّحْمَةً وَعِلْمًا فَاغْفِرْ لِلَّذِينَ تَابُوا وَاتَّبَعُوا سَبِيلَكَ وَقِهِمْ عَذَابَ الْجَحِيمِ
రబ్బనా వాసిఆత కుల్ల షయ్యిర్ రహ్మతవ్వో వ ఇల్మన్ ఫగ్ ఫర్ లి లిల్లాజీనా తాబు వత్తబవూ సబీలకా వఖిహిమ్ అజావల్ జహిమ్ [40:7]

Telugu Translation

మా ప్రభూ నీవు ప్రతి వస్తువును నీ దయానుగ్రహం తో , పరిజ్ఞానంతో ఆవరించి ఉన్నావు కనుక పశ్చాత్తాపం చెంది ,నీ మార్గాన్ని అనుసరించిన వారిని నీవు క్షమించు ఇంకా వారిని నరక శిక్ష నుంచి కూడా కాపాడు!


رَبَّنَا وَأَدْخِلْهُمْ جَنَّاتِ عَدْنٍ الَّتِي وَعَدتَّهُم وَمَن صَلَحَ مِنْ آبَائِهِمْ وَأَزْوَاجِهِمْ وَذُرِّيَّاتِهِمْ إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْحَكِيمُ وَقِهِمُ السَّيِّئَاتِ وَمَن تَقِ السَّيِّئَاتِ يَوْمَئِذٍ فَقَدْ رَحِمْتَهُ وَذَلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ
రబ్బనా వద్ ఖిల్ హుమ్ జన్నాతి అద్ ని నిల్లతి వఅద్త్ హుమ్ వమన్ సలహ మిన్ ఆబాఇహిమ్ వఅజ్వాజిహిమ్ వ జుర్రియాతిహిమ్ ఇన్నక అన్ తా అజీజుల్ హకీమ్ వఖిహిముస్ సయ్యఆతి వ మన్ తఖిస్ సయ్యిఆతి యౌమఇజిన్ ఫఖద్ రహిమతహు వ జాలిక హువల్ ఫౌజుల్ ఆజీమ్ [40:8-9]

Telugu Translation

మా ప్రభూ నువ్వు వారికి వాగ్ధానం చేసి వున్న శాశ్వితమైన స్వర్గవనాలలో వారికి ప్రవేశం కల్పించు మరి వారి పితామహులలోని ,సతిమణులలోని సంతానంలోని సజ్జనులకు కూడా నిశ్చయంగా నీవు సర్వసత్తాధికారివి, వివేక సంపన్నుడివి .
వారిని చెడుల నుండి కూడా కాపాడు యదార్థమేమిటంటే ఆనాడు నీవు చెడుల నుంచి కాపాడిన వారిపై నీవు (అమితంగా ) దయ జూపినట్లే .గొప్ప సాఫల్యం అంటే అదే.


رَبَّنَا اغْفِرْ لَنَا وَلِإِخْوَانِنَا الَّذِينَ سَبَقُونَا بِالْإِيمَانِ وَلَا تَجْعَلْ فِي قُلُوبِنَا غِلًّا لِّلَّذِينَ آمَنُوا
రబ్బన గ్ ఫిర్లనా వలి ఇఖ్వానీనల్లజీనా సబఖూన బిల్ ఈమాని వలా తజ్ ఆల్ ఫి ఖులుబినా గిల్లజినా ఆమను [59:10]

Telugu Translation

మా ప్రభూమ మ్మల్ని క్షమించు మా కన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎలాంటి ద్వేష భావాన్నీ కలిగించకు .


رَبَّنَا إِنَّكَ رَؤُوفٌ رَّحِيمٌ
రబ్బనా ఇన్నక రవూఫుర్ర్ రహిమ్ [59:10]

Telugu Translation

మా ప్రభూ నిశ్చయంగా నీవు మృదు స్వభావం కలిగిన వాడవు కనికరించేవాడవు.


رَّبَّنَا عَلَيْكَ تَوَكَّلْنَا وَإِلَيْكَ أَنَبْنَا وَإِلَيْكَ الْمَصِيرُ
రబ్బనా అలైక తవక్కల్ నా వ ఇలైక అనబ్ నా వ ఇలైకల్ మసీర్ [60:4]

Telugu Translation

మా ప్రభూ మేము నిన్నే నమ్ము కున్నాము నీ వైపునకే మరలుతున్నాము నిన్నే చేరుకోవలసి ఉంది


رَبَّنَا لَا تَجْعَلْنَا فِتْنَةً لِّلَّذِينَ كَفَرُوا وَاغْفِرْ لَنَا رَبَّنَا إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْحَكِيمُ
రబ్బనా లా తజ్ అల్ నా ఫత్ నతల్ లిల్లాజీనా కఫరూ వగ్ ఫిర్ లనా రబ్బనా ఇన్నక అన్ తల్ అజీజుల్ హకీమ్ [60:5]

Telugu Translation

మా ప్రభూ అవిశ్వాసు లకొరకు మమ్మల్ని పరీక్షా సాధనంగా చేయకు ప్రభూ మా తప్పులను క్షమించు నిశ్చయంగా నీవు మాత్రమే సర్వాధికుడవు వివేకవంతుడవు


رَبَّنَا أَتْمِمْ لَنَا نُورَنَا وَاغْفِرْ لَنَا إِنَّكَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ
రబ్బనా అత్ మిమ్ లనా నూరనా వ ఇగ్ ఫిర్ లనా ఇన్నక అలా కుల్లి షయ్యిన్ ఖదీర్.

Telugu Translation

మా ప్రభూ అవిశ్వాసు లకొరకు మమ్మల్ని పరీక్షా సాధనంగా చేయకు ప్రభూ మా తప్పులను క్షమించు నిశ్చయంగా నీవు మాత్రమే సర్వాధికుడవు వివేకవంతుడవు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *