16 Apr 2026, Thu

رَبَّنَا تَقَبَّلْ مِنَّا إِنَّكَ أَنتَ السَّمِيعُ الْعَلِيمُ
రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీ ఉల్ అలీం [2:127]

Telugu Translation

ఓ మా ప్రభూ ! మా సేవలను అంగీకరించు, నిస్సందేహంగా నీవు అందరి మొరలనూ వినేవాడవు సర్వం తెలిసినవాడవు .


رَبَّنَا وَاجْعَلْنَا مُسْلِمَيْنِ لَكَ وَمِن ذُرِّيَّتِنَا أُمَّةً مُّسْلِمَةً لَّكَ وَأَرِنَا مَنَاسِكَنَا وَتُبْ عَلَيْنَا إِنَّكَ أَنتَ التَّوَّابُ الرَّحِيمُ
రబ్బనా వజ్ అల్ నా ముస్లిమైని లక వ మిన్ జుర్రియ్యతినా ఉమ్మతన్ ముస్లిమతల్ లక వ అర్నా మనాసికనా వ తుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్రహీం [2:128]

Telugu Translation

ఓ మా ప్రభూ ! మా ఇద్దరినీ నీ విధేయులుగా చెయ్యి. మా సంతానం నుండి నీ కొరకు ఒక ముస్లిం సమాజాన్ని తయారు చెయ్యి, మాకు నిన్ను ఆరాధించే పద్దతులను నేర్పు, మా పశ్చాతాపాన్ని అంగీకరించు, నిస్సందేహంగా నీవు పశ్చాతాపాన్ని అంగీకరించే వాడవు. దయామయుడవు.


رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا حَسَنَةً وَفِي الآخِرَةِ حَسَنَةً وَقِنَا عَذَابَ النَّارِ
రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతన్ వ ఫిల్ ఆఖి రతి హసనతన్ వఖినా ‘అదాబన్నార్ [2:201]

Telugu Translation

ఓ ప్రభూ ! ఇహలోకం లోనూ మరియు పరలోకం లోనూ మంచిని ప్రసాదించి, నరక శిక్షల నుండి కాపాడుము


رَبَّنَا أَفْرِغْ عَلَيْنَا صَبْرًا وَثَبِّتْ أَقْدَامَنَا وَانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ
రబ్బనా అఫ్ రిగ్ అలైనా సబ్ రన్ వ తబ్బిత్ అఖ్ దామనా వన్ సుర్ నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్ [2:250]

Telugu Translation

ఓ ప్రభూ ! శత్రువులని ఎదుర్కొనునపుడు సహనము ,స్థిరత్వము నొసంగి శత్రువులపై విజయమును నొసంగుము.


رَبَّنَا لاَ تُؤَاخِذْنَا إِن نَّسِينَا أَوْ أَخْطَأْنَا
రబ్బనా లాతు ఆఖిజ్ నా ఇన్ నసీనా ఔ అఖ్ తానా [2:286]

Telugu Translation

ఓ ప్రభూ ! మేము మరచినను లేక పొరపాటు పడినను మమ్ము పట్టకుము .


رَبَّنَا وَلاَ تَحْمِلْ عَلَيْنَا إِصْرًا كَمَا حَمَلْتَهُ عَلَى الَّذِينَ مِن قَبْلِنَا
రబ్బనా వలా త హ్ మిల్ అలైనా ఇస్ రన్ కమాహమల్ తహూ అలల్లజీన మిన్ ఖబ్ లినా [2:286]

Telugu Translation

.ఓ మా ప్రభువా ! మాకు ముందు గడచిన వారిపై నీవు మోపినట్టి భారమును మాపై మోపకుము


رَبَّنَا وَلاَ تُحَمِّلْنَا مَا لاَ طَاقَةَ لَنَا بِهِ وَاعْفُ عَنَّا وَاغْفِرْ لَنَا وَارْحَمْنَا أَنتَ مَوْلاَنَا فَانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ
రబ్బనా వలా తుహమ్మిల్ నా మా లా తాఖత లనా బిహీ వ అఫు అన్నా వగ్ ఫిర్ లనా వర్ హమ్ నా అన్త మౌలానా ఫన్ సుర్ నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్ [2:286]

Telugu Translation

ఓ మా ప్రభూ ! సహింప లేని భారమును మాపై నుంచకుము . మమ్ము వదిలి పెట్టుము . మమ్ము క్షమింపుము . మమ్ము కరుణించుము .నీవే మాకు సహాయుడువు . కావున నీవు అవిశ్వాసులకు విరుద్ధముగా మాకు సహాయము చేయుము


رَبَّنَا لاَ تُزِغْ قُلُوبَنَا بَعْدَ إِذْ هَدَيْتَنَا وَهَبْ لَنَا مِن لَّدُنكَ رَحْمَةً إِنَّكَ أَنتَ الْوَهَّابُ
రబ్బనారబ్బనా లాతుజిగ్ ఖులూబనా బనా బ అద ఇజ్ హదైత నా వ హబ్ లనా మిల్ లదున్క రహ్మ తన ఇన్నక అన్ తల్ వహ్హాబ్ [3:8]

Telugu Translation

ఓ ప్రభూ ! నీవు మాకు సన్మార్గము చూపిన పిదప మా హృదయములను తప్పు త్రోవలకు పోనియ్యకుము . నీ దయను మా పై ఉంచుము . నీవే సర్వము నొసంగువాడవు.


رَبَّنَا إِنَّكَ جَامِعُ النَّاسِ لِيَوْمٍ لاَّ رَيْبَ فِيهِ إِنَّ اللّهَ لاَ يُخْلِفُ الْمِيعَادَ
రబ్బనా ఇన్నక జామి ఉన్నాసి లియౌమిల్ లారైబ ఫీహి ఇన్న ల్లాహ లా యుఖ్ లిఫుల్ మిఆద్ [3:9]

Telugu Translation

ఓ మా ప్రభూ ! నీవు సర్వ జనులను ఒక దినము చేర్తువు . ఆ దినము గూర్చి ఎట్టి సందేహము లేదు . నిశ్చయముగా అల్లా : ఎప్పటికిని తానిచ్చిన మాటకు వ్యతిరేకము చేయడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *