17 Jun 2025, Tue

నమాజ్ రకాతుల సంఖ్య

అయిదు వేళల నమాజులు, రకాతుల సంఖ్య, సమయం

1 ) సమాజ్ : ఈమాన్ తరువాత రెండవ ముఖ్యమయిన విధి నమాజ్. ఇది ప్రాజ్ఞులయిన ప్రతి ముస్లిమ్ స్త్రీ పురుషులకు రేయింబవళ్ళల్లో అయిదు వేళలు విధిగా నిర్ణయమయింది. ఏడేళ్ళు నిండగానే బాలబాలికలకు సమాజ్ ని నిర్దేశించడం విధి .

నమాజ్ నాలుగు రకాలు:

     

      1. ఫర్జ్ నమాజ్

      1. వాజిబ్ నమాజ్

      1. సున్నత్ నమాజ్ (ఇది ఫర్జ్ కాకపోయినా దీన్ని దైవప్రవక్త (సఅనం) క్రమబద్ధంగా చేసేవారు.)

      1. నఫిల్ నమాజ్.

    2 ) నమాజ్ వేళలు:

       

        1. ఫజ్ర్ నమాజ్ ఉషోదయం తరువాత సూర్యోదయానికి పూర్వం వరకు చెయ్యవచ్చు.

        1. జుహర్ నమాజ్ వేళ సూర్యుడు నడినెత్తి నుండి పడమర వైపునకు మరలిన తరువాత ప్రారంభమయి, ఒక వస్తువు నీడ దానికి రెండింతలయ్యే వరకు ఉంటుంది.

        1. అసర్ సమయం, జుహర్ సమయం ముగిసిన తరువాత ప్రారంభమయి సూర్యాస్తమయం వరకు ఉంటుంది.

        1. మగ్రిబ్ వేళ సూర్యాస్తమయం తరువాత పశ్చిమాన ఎరుపు రంగు కానరానంత వరకు ఉంటుంది. దాదాపు 1 గంట, 15 నిముషాలు.

        1. ఇషా వేళ నూర్యాస్తమయానికి గంటన్నర తరువాత ప్రారంభమయి ఉషోదయం వరకు ఉంటుంది.

        1. జుమా సమయం: జుహర్ మాదిరిగానే,

        1. ఈదుల్ ఫిత్ర: రమజాన్ రోజా వ్రతాలు ముగిసిన పిదప జరువుకుంటారు.

        1. ఈదుల్ అజ్ హా : జిల్ హజ్జ పదవ తారీఖున జరుపుకుంటారు. ఇది హజ్రత్ ఇబ్రాహీమ్, హజ్రత్ ఇస్మాయీల్ (అలైహిముస్సలామ్) చేసిన మహోన్నత త్యాగానికి జ్ఞాపకార్థం జరుపుకునే పండుగ.

      రెండు పండుగల సమాజ్ వేళ, సూర్య కాంతి బాగా వ్యాపించిన తరువాత ప్రారంభమయి, సూర్యుడు నడినెత్తిన ఎక్కేవరకు ఉంటుంది.

      నమాజుల పట్టిక
      నమాజ్ పేరు ఫర్జ్ పూర్వం సున్నతులు ఫర్జ్ ఫర్జ్ తరువాత సున్నతులు నఫిల్ నమాజ్ వాజిబ్ నమాజ్
      ఫజ్ర్ 2 2 ఫర్జ్ నమాజ్ తరువాత సూర్యోదయం వరకు మరో నమాజ్ లేదు.
      జుహర్ 4 4 2 2
      అసర్ 4 4 ఆస్ తరువాత సూర్యాస్తమయం వరకు మరే నమాజ్ లేదు.
      మగ్రిబ్ 3 2 2
      ఇషా 4 4 2 2 3
      జుమా 2+4 2 4 2
      ఈదుల్ ఫిత్ర పండుగల్లో కేవలం రెండు రకాతుల వాజిబ్ నమాజ్ మాత్రమే చేస్తారు. ఆ తరువాత ఖుత్బా ప్రసంగం జరుగుతుంది. 2
      ఈదుల్ అజ్ హా

      2

      One thought on “నమాజ్ రకాతుల సంఖ్య”

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *