17 Jun 2025, Tue

నిజమయిన సాఫల్యం

ఇంకా పరలోకంలో అతని విధంగా మోమిన్ కు వచ్చే కష్టాలు దైవ అంతస్తులను ఉన్నతం చేస్తాడు. కారుణ్యానికి కారణభూతమవుతాయి. పైగా మోమిన్ కు దైవం పట్ల దృఢ విశ్వాసం ఉందో లేదో కష్టాలు వచ్చినప్పుడే కదా తెలిసేది. మోమిన్ ప్రపంచంలో భయభక్తులు లేకుండా విశృంఖలంగా జీవితం గడపడు. అందరి అధికారి అయిన విశ్వప్రభువు ఒక్కడున్నాడనే విషయాన్ని అతను ఒక్క క్షణం కూడా మరచిపోకుండా ఆయన ఇష్టాయిష్టాల ప్రకారమే జీవితం గడుపుతాడు.ఇదే మోమిన్ అసలు గొప్పతనం.

నిజానికి విశ్వాసుల లక్షణం ఇలాగే ఉండాలి. వారు సృష్టిలోని వివిధ వస్తువుల్ని దీర్ఘంగా పరిశీలిస్తూ సృష్టికర్త ఔన్నత్యాన్ని ప్రశంసిస్తారు. ఆయన ఆయతుల్ ను విశ్వసిస్తారు. వాటిని పూర్తిగా ఆచరించడానికి శాయశక్తులా కృషి చేస్తారు. ఆయనక కోపాన్ని తెప్పించే ప్రతి చెడుకూ దూరంగా పారిపోవడానికి ప్రయత్నిస్తారు.

ఉదాహరణకు ప్రదర్శనాబుద్ధి ‘షిర్క్’ అని మీకు తెలుసు. దీనివల్ల పెద్ద పెద్ద సత్కార్యాలు కూడా వృధా అవుతాయి. విశ్వాసులు ఏ సత్కార్యాలు చేసినా, ఏ సేవలు చేసినా, ఏ త్యాగాలు చేసినా, వాటి పట్ల సంతోషంతో ఎగిరి గంతేయరు. తాము ఏ పెద్ద భక్తులమయ్యామన్న భావంతో విర్రవీగరు. గొప్ప వాళ్ళమన్న భావన కూడా వారి మనసులోకి రాదు. వీలయినన్ని సత్కార్యాలు చేసి కూడా వీటిని దేవుడు అంగీకరిస్తాడో లేదోనని భయపడతారు. పరలోకంలో సత్కార్యాలకన్నా దుష్కర్మలే ఎక్కువయిపోయి తాము దైవానుగ్రహానికి నోచుకోకుండా పోతామేమోనని కూడా ఒక్కోసారి వారు భయపడతారు. ఈ విధంగా విశ్వాసులు ప్రతి క్షణం దైవానికి భయపడుతూ ఈ ప్రపంచంలో జీవిస్తారు.

హజ్రత్ ఉమర్ (రజిఅన్) జీవిత గాథ మీరు వినే ఉంటారు. అలాంటి మహాపురుషుడే ఇహలోకం వీడిపోతున్నప్పుడు, పరలోకంలో నేను ఏ కాస్త విడిచిపెట్టబడినా నాకు మహాభాగ్యం ప్రాప్తమయినట్లే అన్నారు. మోమిన్ ఆలోచనా ధోరణి అంటే ఇలాగే ఉంటుంది. ఈ విషయంలో హజ్రత్ హసన్ బస్రి (రహ్మలె) ఎంత మంచి మాట చెప్పారు! “మోమిన్ విధేయత పాటిస్తున్నప్పటికీ దైవానికి భయపడుతూ ఉంటాడు. కాని మునాఫిక్ (కపట ముస్లిమ్) చెడుచేస్తూ కూడా దేవానికి భయపడకుండా ఉంటాడు” అని చెప్పారాయన.

పరలోక సాఫల్యానికి కారణభూతమయ్యే జీవితమే అసలు జీవితమంటే. ఈ దృక్పథంతోనే మనం జీవితం గడపాలి. ఈ దృక్పథంతోనే మన ఆలోచనల్ని, మ నడవడికల్ని, మన వ్యవహారాల్ని సంస్కరించుకోవాలి. అప్పుడే మనం నిజమయిని సాఫల్యానికి అర్హులమవుతాము.

ప్రవక్త ఇల్యాస్ (అలైహిస్సలాం)

One thought on “నిజమయిన సాఫల్యం”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *