17 Jun 2025, Tue

ప్రవక్త ఇస్ హాక్ (అలైహిస్సలాం)

కల

యాకూబ్(అస) ప్రయాణం అనేక రోజుల పాటు కొనసాగింది. ప్రయాణం చాలా కష్టంగా, అంతం లేనిదిగా కనబడసాగింది. కనుచూపుమేరలో ఒక్క ఇల్లు కూడా కానరావడం లేదు. తానిక వెనక్కి వెళ్ళిపోవడం మంచిదని ఆయన భావించారు. ఒక రాతినీడన కూర్చుని నిద్రపోయారు. ఆయనకు ఒక ప్రేరణాత్మక మైన కల వచ్చింది. తనకు అల్లాహ్ ఒక మంచి జీవితాన్ని, ఇద్దరు మంచి కుమారులను ప్రసాదించినట్లు, వారు ఒక పెద్ద రాజ్యానికి పరిరక్షకులైనట్లు, వారు దేవుని హిత బోధను ప్రజలకు బోధిస్తున్నట్లు ఆయన కలగన్నారు. ఈ కల ఆయనకు గొప్ప ప్రేరణను ఇచ్చింది.

ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించారు. కొన్ని రోజుల తర్వాత ఆయనకు ఒక మైదానంలో మేస్తున్న గొర్రెలు, కొందరు పిల్లలు కనబడ్డారు. వారితో ఆయన లబన్ గురించి ప్రశ్నించారు. వారు జవాబిస్తూ, “ప్రవక్త ఇస్ హాక్ (అస) బావమరిది గురించి తెలియని వారెవ్వరు. ఆయన తన జాతిప్రజల నాయ కుడు. ఈ గొర్రెలన్నీ ఆయనవే” అంటూ ఒక అమ్మాయిని చూపించి, “అదిగో, ఆ అమ్మాయి ఆయన కూతురు రాకెల్” అన్నారు. ఆమె చాలా అందమైన అమ్మాయి. యాఖూబ్ (అస) సిగ్గుపడుతూ ఆమె వద్దకు వెళ్ళి తనను తాను పరిచయం చేసుకున్నారు. ఆమె ఆయనకు మర్యాదగా స్వాగతం పలికి ఇంటికి

కన్నీళ్ళతో లబన్ తన సోదరి కుమారుడిని స్వాగతించారు. పలకరింపులు అయిన తర్వాత యాకూబ్ (అస) తాను ఇంత దూరం ప్రయాణించి రావడానికి కారణం వివరించారు. లబన్ అంతా విని యాకూబ్ (అస) ప్రతిపాదనను అంగీక రించారు. అయితే ఆయన ఒక షరతు విధించారు. పెళ్ళికి ముందు యాకూబ్ (అస) ఏడేళ్ళు తన వద్ద పనిచేయాలని అన్నారు. యాకూబ్(అస) ఆ షరతుకు అంగీకరించారు. తన పనులను నిబద్ధతతో నిర్వర్తించసాగారు.

(రచయిత వ్యాఖ్య : ఈ విధంగా యాకూబ్ (అస) పెళ్ళిని ఆలస్యం చేయ డానికి కారణం బహు ….. లబన్ పెద్ద కుమార్తెకు అప్పటికి వివాహం కాలేదు. ఈ లోపు ఆమెకు వివాహం చేస్తే చిన్న కుమార్తెను యాకూబ్ (అస)కు పెళ్ళిచేయడానికి వీలవుతుందని ఆ తండ్రి భావించి ఉంటారు.)

ఏడేళ్ళు గడచిన తర్వాత కూడా తండ్రికి తన పెద్ద కుమార్తెకు పెళ్ళి చేయడం అన్న సమస్య పరిష్కారం కాలేదు. ఆయన ఈ సమస్యను యాకూబ్ (అస)తో చర్చించారు. తన పెద్ద కుమార్తె “లీహ్”ని ముందుగా పెళ్ళి చేసుకో వాలని, తర్వాత మరో ఏడేళ్ళు పనిచేసి చిన్న కుమార్తె రాకెల్ను పెళ్ళి చేసుకోవాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను కూడా యాకూబ్(అస) అంగీకరించి మరో ఏడేళ్ళపాటు ఆయన వద్ద పని చేశారు. చివరకు ఆయన రాకెల్ను వివాహం చేసుకున్నారు.

(తర్వాతి కాలంలో అక్కాచెల్లెళ్ళను ఇద్దరినీ ఒకే సమయంలో పెళ్ళి చేసుకోవడాన్ని ఇస్లాం నిషేధించింది. భార్య మరణించక ముందు గాని లేక విడాకులు కాకుండా కాని ఆమె సోదరిని పెళ్ళాడ్డం నిషిద్ధమయ్యింది.)

తండ్రి ఆ ఇరువురు కుమార్తెలకు ఇరువురు బానిస స్త్రీలను ఇచ్చారు. వారికి సేవకులుగా, వారికి తోడు ఉండేవారిగా వారిని బహూకరించడం జరిగింది. ఆ ఇరువురు తమ బానిస స్త్రీలకు తమ భర్తతో పెళ్ళి చేశారు. ఈ నలుగురు భార్యల వల్ల ఆయనకు పన్నెండు మంది సంతానం కలిగారు. రబున్, షమూన్, లావి, యహూదా, జౌలున్ అనే కుమారులు మొదటి భార్య లీహ్ వల్ల జన్మిం చారు. రెండవ భార్య రాకెల్ వల్ల యూసుఫ్ (అస), బిన్యిమిన్లు జన్మించారు. మిగిలిన నలుగురు మరో ఇద్దరు భార్యల వల్ల జన్మించారు.

Du’as and Dhikr for Arafah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *