2.2.1 ఒక దినమున హాబీలు పొలములో నుండగా, ఖాబీలు కోపముతో-నీవు అఖ్ లిమా విడనాడు-లేనిచో నిన్ను వధింతునని చెప్పెను. అపుడు హాబీలు- నీవు నన్ను వధించ యత్నించినను, నేను నిన్ను వధింప యత్నించను; అట్టి పాపానికి నేను పూనుకొనను. అల్లాహ్ శిక్షకు నేను భయపడుచున్నాను, ఆ పాపమును నీవే అను భవించెదవు, దానికి ఫలితము నరకము పొందెదవు. అల్లాహ్ సత్రియుల అర్పణను (ఖుర్బానీని) అంగీకరించును, అందులకు నీకు కోపమేల? నీవు భక్తి వహింపుము, పాపమునకు పూనుకొనకుము, దానికి ప్రతిఫలము నరకము అని పలికెను.
“పిదప హాబీలునకు వధించుటకై ఆతని ఆత్మ సహకరించెను, సైతాను ప్రోత్బలము ఆతనికి మరింత పురికొల్పెను. హాబీలును ఎట్లు చంపవలెనో ఖాబీలునకు తెలియదు కావున ఆతని క్రింద పడవైచి ఇటునటు గ్రుద్దు చుండెను. పిదపసైతాను ప్రోత్బలము వలన చివరకు హాబీలును చంపివేసెను. ఈ హత్యకు ముందు మానవులలో ఎవరును చనిపోలేదు. ఇదియే ఈ భూమండలంపై మొట్టమొదటి నరహత్య. కావున ఏమి చేయాలో తెలియక శవమును మోసుకొని ఖాబీలు అటునిటు పారిపోసాగెను. అంతలో అల్లాహ్ చే పంపబడిన రెండు కాకులు అతని చెంతకు చేరెను. ఒకకాకి మరొక కాకిని ముక్కుతో రక్కిచంపెను. పిదప ఆ కాకి భూమిని త్రవ్వి చచ్చిన కాకిని పూడ్చుచుండగా ఖాబీలు చూచి సిగ్గుతెచ్చుకొని తన సహోదరుని శవమును అటులే మట్టిలో పూడ్చెను. అప్పటి నుండియే మానవుడు చచ్చిన పిదప సమాధి చేయవలెనని తెలిసికొనెను.
2.2.2 ఖాబీలును దేవుడు శపించిన విధము తౌరాతు బైబిలు గ్రంధములో యిట్లున్నది-యోహోవా (దేవుడు) నీ తమ్ముడైన హేబిలు ఎక్కడ నున్నాడని కయీనుకు అడుగగా-అతడు-నే నెరుగను. నా తమ్మునికి నేను కావలివాడనా? అనెను. అప్పుడాయన (దేవుడు) నీవు చేసినపని యేమి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు, నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండ నీవు శపింపబడిన వాడవు. నీవు నేలకు సేధ్యపరచునపుడు అది తన సారమును యిక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరి వై యుందువనెను. తుదకు ఖాబీలు భీతితో మరో దేశమునకు పారిపోయెను. (అధ్యాయము-9-13 వాక్యము)
2.2.3 యిక హదీసు గ్రంధములో వధించుటను గూర్చి యిట్లున్నది- ఏ మానవుడైనను అన్యాయముగా వధింపబడినపుడు డెల్ల ఆ హత్యలోని కొంత భాగము (పాపము) ఆదము యొక్క కుమారుడు ఖాబీలునకు లభించును. ఎందుకనగా వాడే మొట్ట మొదటి హత్యను కనిపెట్టిన వాడు అని విశ్వ ప్రవక్త(స అ) తెలిపిరని యిబ్నెమస్ ఊద్ (రజి) తెలిపిరి. (బుఖారీ, ముస్లిమ్)
యీ పై విషయాలను గూర్చి దివ్య దైవాజ్ఞ ఖురాన్ గ్రంధములో యిట్లున్నది-
2.2.4 ఆదము యొక్క యిద్దరు పుత్రుల నిజమైన విషయాలు వారికి (యూదులకు) వినిపింపుడు. వారిద్దరూ అల్లాహు మ్రొక్కుకొనగా వారిలో నొకని మ్రొక్కుబడి అంగీకరింపబడెను, రెండవ యాతడు(ఖాబీలు) నేను నిన్ను చంపుదును అని పలుకగా-అల్లాహ్ భక్తుల మ్రొక్కు బడిని మాత్రము అంగీకరించును. నీవు నన్ను చంపుటకు చేయి చాచినచో నేను నిన్ను చంపుటకు చేయిచాచను. సర్వలోకములకు పోషకుడగు అల్లాహ్కు నేను భయపడుచున్నాను. నీవు నా పాపమును, నీ పాపమును పొంది నరక నివాసులలో నొకడవుదువు గాక! అని నేను కోరుచున్నాను. యిది దుష్టులకు శిక్ష అని (హాబీలు) పలికెను. ఆ పిదప ఆతని యాత్మ తన సహోదరుని చంపుటకు పురికొల్పెను. పిదప అతడు అతనిని చంపి, నష్టముపొందు వారిలో నొక డాయెను. ఆ పిదప సోదరుని శవమును ఎట్లు పూడ్చవలెనో అతనికి చూపుటకై భూమిని త్రవ్వునట్టి ఒక కాకిని దేవుడు పంపెను. పిదప ఆతడు (ఖాబీలు) అయ్యో! నేను నా సోదరుని శవమును పూడ్చిపెట్టు విషయమున ఈ కాకి పాటి వాడిని కూడకాలేకపోతినే అని పలికి చాల పశ్చాత్తాపపడెను. (మాయిదా-27-31)
2.2.5 హ: ఆదమ్ (అ) తన కుమారుడు మృతి నొందెనని తెలిసికొని చాల కాలం వరకు చింతలోనే మునిగి యుండెను. పిదప కొంతకాలానికి మరో పుత్రుని ప్రసాదించెనని సంతోషముతో కుమారుని ‘షీత్’ అని పేరుపెట్టెను. ఆ పిదప వారికి అనేక మంది కుమారులు, కుమార్తెలు కలిగిరి. వారి సంతానము భూమిపై అటు నిటు వ్యాపింప సాగెను. హజ్రత్ ఆదమ్ అలైహిస్సలామ్ బ్రతికిన దినము లన్నియు తొమ్మిది వందల ముప్పది యేండ్లు అని కొన్ని గ్రంధముల వలన తెలియుచున్నది. నిజము దేవుడెరుక.
[…] హాబీల్—ఖాబీల్ Battle of badr Supplications for Travel Duʿā for Protecting Blessings and Staying Peaceful 🌸 Duʿās for Sadness and Anxiety 🌸 […]