వుజూ అంటే సాధారణంగా ఆచ్చాదన లేకుండా ఉండే శరీర భాగాలను పరిశుభ్రపరచుకోవడం అన్నమాట. వుజూలోని ముఖ్యాంశాలు:
- వుజూ నియ్యత్ (సంకల్పం) చేసుకోవడం.
- నీరు పరిశుద్ధమయినదయి ఉండటం.
- బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం పఠించడం.
- రెండు చేతుల్ని ముంజేతుల వరకు మూడుసార్లు కడుక్కోవడం.
- పల్లను మిస్వాక్ (పలుదోము పుల్ల)తో గాని వ్రేలుతోగాని తోమడం.
- ముక్కులో నీరు ఎక్కించి మూడుసార్లు పరిశుభ్రపరచడం.
- ముంగురులు మొదలుకుని నుదుటితో సహా గడ్డం వరకు ఇంకా కుడి చెవి నుండి ఎడమ చెవి వరకు మొత్తం ముఖాన్ని మూడుసార్లు కడుక్కోవడం.
- ముందు కుడి చెయ్యి తరువాత ఎడమ చెయ్యి మోచేతుల వరకు మూడు సార్లు కడుక్కోవడం.
- రెండు అరచేతుల్ని నీటితో తడిపి తలపై ‘మసహ్’ చెయ్యడం (స్పర్శిం చడం). అలాగే చూపుడు వ్రేళ్ళతో చెవుల లోపలి భాగాలను, బొటన వ్రేళ్ళతో వెలుపలి భాగాలను ‘మసహ్’ (తడమడం) చెయ్యాలి. ఇంకా చేతి వ్రేళ్ళ వెనకటి భాగంతో మెడను ‘మసహ్’ చెయ్యాలి.
- ముందు కుడి పాదం తరువాత ఎడమ పాదం చీలమండలాల వరకు మూడు పర్యాయాలు శుభ్రం చెయ్యడం. నమాజ్ చెయ్యడానికి, దివ్యఖుర్ఆన్ ను ముట్టుకోవడం, చదవడం కొరకు, కాబా ప్రదక్షిణం కోసం, కాబాలో ప్రవేశించేందుకు వుజూ చెయ్యడం అవసరం.
వుజూను భంగపరిచే విషయాలు :- ఈ విషయాల వల్ల వుజూ భంగమవుతుంది
- మలమూత్ర విసర్జన,
- మలమూత్ర స్థానాల నుండి ఏ పదార్థమయినా బయల్పడటం.
- మలస్థానం నుండి వాయు (అపానవాయు) విసర్జన.
- శరీరంలోని ఏ భాగం నుండయినా రక్తం, చీము కారి ప్రవహించడం.
- నోటినిండా వాంతి చేసుకోవడం.
- పడుకుని లేక దేని ఆధారంగానయినా వ్రాలి నిద్ర పోవడం.
- స్పృహ కోల్పోవడం.
- మతి చలించడం.
- ప్రాజ్ఞతగల మనిషి నామాజ్లో బిగర్గగా నవ్వడం .
- ఉమ్మిలో రక్తం అధికంగా రావటం.
తయమ్ముమ్ : ఇది నీరు లభ్యంకాని సందర్భాలలో గుసుల్ కు బదులు,
వుజూకు బదులుగా అనుసరించే విధానం:
- నీరు ఒక మైలు దూరంలోపు లభించనప్పుడు,
- నీటి ప్రయోగం వల్ల వ్యాధి కలిగే లేక వ్యాధి అధికమయ్యే ఆస్కారమున్నప్పుడు.
- శత్రుభయం వల్ల నీరు తెచ్చుకోవడం సాధ్యం కానప్పుడు, బావి నుండి నీరు చేదుకోవడం వీలుకాకపోయినప్పుడు.
- ప్రయాణంలో త్రాగడానికి మటుకే నీరున్నప్పుడు.
- ప్రయాణంలో వుజూ చేసేందుకు వీలు లేకపోయినప్పుడు.
- జనాజా నమాజ్ లేక ఈద్ నమాజ్ కు అందకుండాపొయ్యే ప్రమాదముంటే తయమ్ముమ్ చెయ్యడం ధర్మ సమ్మతమే.
తయమ్ముమ్ విధానం:
పరిశుద్ధత పొందడానికి తయమ్ముమ్ చేస్తున్నానని
నియ్యత్ (సంకల్పం) చేసుకోవాలి. తరువాత బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం పఠించి రెండు చేతులూ వ్రేళ్ళతో సహా పరిశుద్ధమయిన పొడి మన్నుపై అదమాలి. ఆ తరువాత చేతుల్ని బాగా విదిలించి ముఖమంతా తడుము కోవాలి. రెండోసారి కూడా రెండు చేతులు పొడిమన్నుపై అదిమి, విదిలించి రెండు చేతుల్ని మోచేతుల వరకు కుడి చేతిని ఎడమ చెయ్యితోను, ఎడమ చేతిని కుడి చేత్తోనూ తడుముకోవాలి. నీరు ప్రాప్తం కాగానే లేక. వ్యాధి దూరం కాగానే తయమ్ముమ్ భంగమవుతుంది. వుజూ చేసుకోవడం తప్పనిసరి. మలమూత్ర విసర్జన తరువాత ఆయా భాగాలను నీరు లేనప్పుడు మట్టిపెడ్డలతోనూ ఆ తరువాత నీటితోనూ శుభ్రపరుచుకోవడం ముఖ్యం.
After the Adhān (Call to Prayer) – Sunnah Duas
[…] wuzu-ka-tarika […]