ఇబ్రాహీమ్ (అస) మొదటి భార్య సారా. వయసుమీద పడడం వల్ల, తనకు పిల్లలు జన్మించే ఆశ లేనందు వల్ల తమ సేవకురాలు హాజిరాను తన భర్త పెళ్ళా డితే ఆ విధంగా తన భర్తకు అతను కోరే సంతానం లభిస్తుందని భావించి సారా తన భర్తకు హాజిరాతో పెళ్ళి జరిపించారు. హాజిరా వల్ల ఇస్మాయీల్(అస) జన్మించారు. కాని తర్వాత సారా అసూయతో రగిలిపోయారు. ఫలితంగా హాజిరా, ఆమె కుమారుడు ఇస్మాయీల్ నిర్మానుష్య ప్రదేశంలో వదలివేయ బడ్డారు. కాని సారా స్వతహాగా త్యాగ స్వభావం కలిగిన స్త్రీ. అందువల్ల ఆమెను దేవుడు వదలివేయలేదు. ఆమెకు కూడా వృద్ధాప్యంలో సంతానాన్ని ప్రసాదిం చాడు. ఆ విధంగా ఆమెకు ఇస్ హాక్ (అస) జన్మించారు.
దివ్యఖుర్ఆన్లో సూరా 37:112-113 ఆయతుల్లో ఈ విధంగా చెప్పడం
“మేము ఆయనకు (ఇబ్రాహీమ్ కు) తెలియ జేశాము. ఇస్ హాక్ ఒక ప్రవక్త అవుతారని, గౌరవనీయుడవుతారని చెప్పాము. వారిద్ద రిని మేము అనుగ్రహించాము. వారి సంతా నంలో కొందరు సన్మార్గులుగా వ్యవహరిం చారు కాగా కొందరు దారి తప్పారు.”
సోదరునికన్నా మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ నిన్ను కాపాడుతాడు” అన్నారు.
ఆ రాత్రి కన్నీళ్ళతో యాకూబ్ (అస) తన తల్లిదండ్రులకు వీడ్కోలు పలికి తన సోదరునికి తెలియకుండా వెళ్ళిపోయారు.