18 Jan 2026, Sun

ప్రవక్త ఇల్యాస్ (అలైహిస్సలాం)

ఇల్యాస్ ప్రవక్త కాలంలో ప్రజలు ‘బాల్’ విగ్రహాన్ని సూర్యదేవుడి పేరుతో ఆరాధించేవారు.

బాల్ బక్ పట్టణంలో బనీ ఇస్రా యీల్ కు చెందిన ఒక వర్గం ప్రజలు నివసించేవారు. ఈ పట్టణం లెబనాన్ లో ఉంది. కాని ఈ ప్రజలు ప్రవక్తల బోధన లను పెడచెవిన పెట్టి విగ్రహారాధన ప్రారం భించారు. వారు ఒక పెద్ద విగ్రహాన్ని తయారు చేసి దానికి “బాల్” అని పేరు పెట్టారు (సూర్యునికి గౌరవసూచకంగా తయారు చేసిన విగ్రహం అది). ఈ విగ్ర హాన్ని తమ ప్రధాన దైవంగా భావించే వారు. అందువల్లనే ఆ పట్టణానికి “బాల్ బక్” అన్న పేరు వచ్చింది. బాల్ బక్ అంటే బాల్ నగరమని అర్థం (టవర్ ఆఫ్ బాబెల్).

వారి వద్దకు అల్లాహ్ తన ప్రవక్త ఇల్యాస్ ను పంపించాడు. ఆయన వారి వద్దకు వచ్చి హితబోధ చేశారు. ఏకైక దేవుడైన అల్లాహ్ ను ఆరాధించాలని, సూర్య దేవుడని బాల్ ఆరాధన చేయ రాదని చెప్పారు. కాని వారు ఆయన మాటలను తిరస్కరించారు. ఫలితంగా ఇహలోకంలోను, పరలోకంలోనూ అల్లాహ్ ఆగ్రహానికి గురయ్యారు.

ఇల్యాస్(అస) చూపిన నిజాయితీ, కఠిన ప్రయత్నాల కారణంగా అల్లాహ్ ఆయన గురించి చాలా గొప్పగా దివ్య ఖుర్ఆన్లో ప్రస్తావించాడు:

“ఇల్యాస్ ఒక ప్రవక్త. ఆయన తన జాతి ప్రజలతో, ‘మీరు మీ విధిని నిర్వర్తించరా? మీరు బాల్ కు మొరపెట్టుకుని ఉత్తమ సృష్టికర్తను విస్మరిస్తారా? అల్లాహ్ మీకు ప్రభువు, మీ పూర్వీకులకు అందరికీ ప్రభువు’ అని చెప్పారు. కాని వారు ఆయన్ను తిరస్కరించారు. వారిని తప్పక లాక్కురావడం జరుగుతుంది (శిక్షించడానికి). నిజాయితీ, నిబద్ధత కలిగిన దైవభక్తులను తప్ప. మేము ఆయన పేరును తర్వాతి తరాల్లో ప్రస్తావించబడేలా చేశాము. ఇల్యాస్ పై శాంతి కురియుగాక! సానుభూతితో వ్యవహరించిన వారిని మేము ఈ విధంగా బహూకరి స్తాము. ఆయన మాపై విశ్వాసం కలిగిన దాసుల్లో ఒకడు.”

(దివ్యఖుర్ఆన్ : 37:123-132)

ఇల్యాస్ ప్రవక్త తర్వాత అల్లాహ్ ‘ అల్ యసా’ను ప్రవక్తగా పంపాడు.

(చదవండి దివ్యఖుర్ఆన్ : 38:48, 6:25)

నిజమయిన సాఫల్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *