హాబీలు-ఖాబీలు హజ్రత్ ఆదమ్ (అ) మొదటి సంతానము-వివాహం-వివాహంలో విరోధం-అసూయ, క్రోధం, ఒకరినొకరు వధించు కోవడం మొదలగు విషయములు.
2.1.1 “హజ్రత్ ఆదమ్ మరియు హవ్వా (అ)- వారిద్దరిని ఆకాశమండలం నుండి భూమండలానికి దైవాజ్ఞచే దింపబడిరి. హ: ఆదమ్ (అ)తన భార్య హవ్వాను కూడినపుడు ఆమె గర్భవతి ఆయెను. పిదప వారికి మొదటి కాన్పులో ‘హాబీల్’ అను మగ బిడ్డ- ‘లబూజా’ అను ఆడబిడ్డ. ఆ కాలం ధర్మ ప్రకారం ‘హాబీల్ కు అఖ్ లిమా’ తో వివాహం జరిపించవలసి యుండెను. కాని ఖాబీల్ దానికి ఒప్పుకొనక అఖ్ లిమా సౌంధర్యానికి మోహితుడై, ఆమెతోనే తనకు వివాహం జరిపించవలసిందిగా తన తండ్రిని కోరెను. (ఆ కాలం అన్నా చెల్లెండ్రుల వివాహము నిషేదింపబడి యుండలేదు. అప్పటికి అనుసరింపవలసిన ధర్మాలు రాలేదు.) అయిన హ॥ ఆదమ్ తన కుమారుని మాటను నిరాకరించి ‘హాబీల్ కు అఖ్ లిమా వివాహం జరిపించెను. దానికి ఖాబీల్ ఓర్వలేకపోయెను. తన సహోదరుడైన హాబీల్ పై అసూయత వహించి, విరోధించి శత్రుత్వంతో పగ పూనెను. సరియైన సమయం చూచి బుద్ధి చెప్పాలని వేచియుండెను.
అయితే వారితో “ఓ కుమారులారా! మీరిద్దరు కలసి అల్లాహ్కు మ్రొక్కుబడి చేసికొనుడు. ఎవరి మ్రొక్కుబడి (కానుకను, అర్పణను) అల్లాహ్ అంగీకరించునో అతడు ‘అఖ్ లిమా’ను పొందవచ్చును అని పలికెను.
నోట్: వీరిద్దరి నుండియే మ్రొక్కుబడి, అందం, ఆకర్షణ అసూయత, విరోధం, శత్రుత్వం, పగ, చంపుకోవడం అనునవి మొట్టమొదట మొదలైనవి.
2.1.2 “తండ్రి చెప్పిన మాటలు విని కుమారు లిద్దరు అల్లాహ్ కు మ్రొక్కుబడి చెల్లించుటకు పూను కొనిరి. ‘హాబీల్’ గొర్రెల కాపరి, ‘ఖాబీల్’ భూమిని సేధ్యపరచువాడు రైతు. హాబీల్ తనకున్న మంద నుండి తొలుచూలు పుట్టిన వాటిలో బాగా బలసిన క్రొవ్విన పొట్టేలును అల్లాహ్ కు అర్పణగా తెచ్చెను. ఖాబీలు తన వ్యవసాయ పంట నుండి నిరర్ధకమైన ధాన్యపు గుత్తులను అల్లాహ్ కు అర్పణగా తెచ్చెను. పిదప కొద్ది సేపటికే ఆకాశమునుండి అగ్ని వచ్చి హాబీలు సమర్పించిన అర్పణను పొట్టేలును అంగీకరించెను. ఖాబీలు సమర్పించిన అర్పణను ధాన్యపు గుత్తులను లక్ష్యపెట్టకుండెను. ( ఆ కాలములో అల్లాహు అర్పించిన కానుకను అంగీకరించినట్లు గుర్తుగా ఆకాశమునుండి అగ్ని ఆ అర్పణపై వచ్చిపడి కాల్చుచుండెను. ఆ గుర్తును బట్టియే వారివారి అర్పణలు అంగీకరింపబడినట్లు తెలుసుకొనుచుండిరి.) అల్లాహ్ ఖాబీలు సమర్పణను అంగీకరించలేదని తెలిసికొని మిక్కిలి కోపముతో తన ముఖము చిన్న బుచ్చుకొనెను. పిదప తన కుమారుడు ఖాబీలు తో-నేను అల్లాహ్ గృ హ దర్శనమునకు వెళ్ళుచున్నాను. నేనొచ్చినంత వరకు యింటిని భద్రంగా చూడు అని చెప్పి తనకు బదులుగా తన కుమారుని (ఖలీఫా) ప్రతినిధిగా చేసి బాధ్యతలు అప్పగించి ఆదమ్ (అ) మదీనా పురమునకు పోయెను. ఈ విధంగా ఖాబీలుకు మంచి సమయం కలసి వచ్చెను. (నిజము దేవుడెరుక. పై వాక్యములు గ్రంథముల నుండి సేకరింపబడినవి). ఇక దైవాజ్ఞలు తెలిసికొందము.
